అలరించిన యేసుక్రీస్తు నాటకం

మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో సోమవారం రాత్రికి యేసుక్రీస్తు జీవిత చరిత్ర బయలు నాటకము జీవితచరిత్ర ప్రదర్శింపచేయడం జరిగిందని నాటక కార్యనిర్వాహణకుడు రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.ఏసయ్య తెలిపారు. సోమవారం రాత్రికి మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామానికి మేథడిస్ట్ యూత్ చెందిన 32 మంది యువకులతో గ్రామాంలో యేసుక్రీస్తు జీవితచరిత్ర బయలు నాటకమును నిర్వహించడం జరుగుతుందన్నారు. 1న రాత్రి 1వ భాగం నాటకము పూర్తయింది. 2న రాత్రి 2వ భాగం నాటకములను నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటకము నిర్వహించే రంగస్థలానికి రంగు రంగుల విద్యుత్ దీపములచే అలంకరించి, హల్లికేడ్ పరుదలతో అలంకరణ, వికారాబాద్ శ్రీనీలకంఠ డ్రా మా కంపేని వారితో వేషదారులకు మేకప్ వేయించడం జరిగిందన్నారు.

ఝరసంగం మండల పరిధిలోని కంబలపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య దర్శకత్వంతో నాటకము నిర్వహించడం జరిగిందన్నారు. వివిధ మండల పరిధిలోని భక్తులు పాల్గొని నాటకమును విజయవతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ కాం పెండ్ డెలిగెట్ ఎం.శివకూమర్, గ్రామసర్పం చ్ టి.బక్కగౌడ్, ఎంపీటీసీ సీహెచ్.విఠల్, మండల టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి.తుకారం కురుమ, ఉపసర్పంచ్ జి.ల క్ష్మన్, లెమెన్ సుకూమర్, పాస్టర్ డా.డెవిడ్, మండల టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, సంఘ పెద్దలు తదితరులు ఉన్నారు.

Leave a comment