సెక్సీగా ఉందని హీరోయిన్ పై వేటు

డెన్నీ క్వాన్‌… ఈ 24 ఏళ్ల కాంబోడియన్‌ హీరోయిన్‌కు ఒళ్లంతా వయ్యారమే! అందుకే.. తెరంగేట్రం చేసిన కొద్దిరోజులకే మాస్‌ అభిమానులకు సెక్సి ‘ఇష్ట్‌’ తారగా మారిపోయిందా పడతి. అలా తన అందాలతోనే అందనంత ఎత్తుకు ఎదిగిన ఆ చిన్నదానికి ఇప్పుడు ఒంపుసొంపుల ప్రదర్శనే మైనస్‌ అయి కూర్చింది! ‘నీలో శృంగార రసం మరీ ఎక్కువైందమ్మడూ’ అంటూ ఆ దేశ సాంస్కృతిక శాఖ కన్నెర్ర చేసింది. అంగాంగ ప్రదర్శనతో ‘నియమావళి’ని ఉల్లంఘించిందంటూ క్వాన్‌పై ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేకాదు.. సినిమాలో ఎలా కనిపించాలి? మరీ ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల్లో సాంస్కృతిక మంత్రిత్వశాఖతో ఆమెకు శిక్షణ ఇప్పించాలని ఆదేశించింది.

Advertisements

సదాశివపేటలో సందడి చేసిన సినీతారలు

సదాశివపేట పట్టణంలో సినీతారలు సందడి చేశారు. ఎస్‌ఆర్‌పీ పతాకంపై నిర్మించిన ఇద్దరి మధ్యన 18.. చిత్రం శుక్రవారం విడుదలైంది. స్థానిక జ్యోతి థియేటర్‌లో సినిమా నటీనటులు ప్రేక్షకుల సమక్షంలో గంటసేపు సినిమాను తిలకించారు. నిర్మాత శివరాజ్‌పాటిల్‌ ప్రేక్షకులతో మాట్లాడి సినిమా ఎలా ఉందని ఆరా తీశారు. చిత్ర కథానాయకుడు రామ్‌కార్తీక్‌, నటి భాను త్రిపాటి, సంగీత దర్శకుడు గంటాడి కృష్ణ, డీపీఓ జీఎల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని రుక్మిణీ థియేటర్‌లో ఈ నటులు సందడి చేశారు.

నాని మరో సినిమాకి టైటిల్ ఫిక్స్..!

వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న నాని మరో సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ వంటి సూపర్ హిట్ విజయాన్ని తనకు అందించిన హను రాఘవపూడితో ఈ నేచురల్ స్టార్ త్వరలో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. నాని ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం లో నివేదా థామస్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ వరకు ఈ చిత్ర షూటింగ్ ని పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేసి జూలై 12న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే నాని దిల్ రాజు నిర్మాణంలో ఎంసీఏ అనే చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడు. అక్టోబర్ వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసి వెంటనే హను రాఘవపూడి తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ కోసం పని చేయనున్నాడు నాని. ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి ‘అదిగో అల్లదిగో’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. హను రాఘవపూడి ప్రస్తుతం నితిన్ హీరోగా లై అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.