నాసాకు మెతుకుసీమ ఆణిముత్యం

మెతుకుసీమ విద్యార్ధిని రమ్యశ్రీ నాసాకు ఎంపికైంది. మెదక్ పట్టణం పిట్లం బేస్ కు చెందిన జీవన్ గౌడ్ -జ్యోతి దంప తుల రెండో కూతురు రమ్యశ్రీ బాసరా ట్రిప ల్ఐటీలో సీఈసీ మొదటి సంవత్సరం చదువు తోంది. కాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించిన – 2017 నాసా పోటీలలో ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 1500 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. ఈ పోటీలలో బాసర ట్రిపుల్ఐటీకి చెందిన విహాన్ ప్రాజెక్టుకు ద్వితీయ స్థానం లభించింది. విహన్ కాంటెస్ట్ గ్రూపు ఆధ్వ ర్యంలో రూపొందించిన స్పేస్ కాంటెస్ట్లో ‘చంద్రుడి వద్ద మానవ మనుగడ కోసం ఉపయోగించే వనరుల పై దీసెర్చ్ చేసి ప్రతిభ కనబరిచారు. విహాన్ కాంటెస్ట్ గ్రూపునకు చెందిన ఐదుగురు విద్యార్ధులలో మెదక్ పట్టణానికి చెందిన రమ్యశ్రీ ఒకరు. మే 25 నుంచి 29 వరకు అమెరికాలో జరిగే నాసా సదస్సుకు హాజరుకావాలని వీరికి నాసా ఆహ్వానం పలికింది. ఈ మేరకు అమెరికాకు బయ లుదేరేందుకు ఖర్చులకు అవసరమయ్యే డబ్బుల కోసం మంత్రి హరీశ్రావను సైతం కలిశారు.సదస్సుకు వెళ్ళేందుకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తే అమెరికాలో జరిగే నాసా సదస్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తామని రమ్యశ్రీ తెలిపారు. అమెరికాలో జరిగే నాసాకు రమ్యశ్రీ ఎంపిక కావడంతో రమ్యశ్రీ కుటుంబ సభ్యు లు ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

Advertisements