1న సంగారెడ్డిలో ప్రజాగర్జన- తెలంగాణకు రానున్న రాహుల్..

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీలో ఎన్నికల హడావుడి మొదలైంది. హైకమాండ్ ఆదేశాలతో జోరు పెంచిన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జిల్లా స్థాయి నేతలు ప్రభుత్వంపై విమర్శల స్వరాన్ని పెంచారు. ఇక క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న పార్టీ నేతలు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రంగంలోకి దింపబోతోంది.

వచ్చే నెల 1న సంగారెడ్డిలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ కాంగ్రెస్. ఈ సభతో రాష్ట్రంలో గత వైభవాన్ని తిరిగి సంపాధించుకోవాలని భావిస్తోంది.రైతు సమస్యలను ప్రధానంగా చేసుకుని ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు హస్తం నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కొన్ని బాధిత వర్గాలను కలిసే ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ పర్యటన వివరాలను వెల్లడించారు.

రాష్ట్ర ఆవిర్భం అనంతరం రాహుల్ హజరవుతున్న రాజకీయ సభ కానుండటంతో రాహుల్‌ సభకు లక్షన్నర మందితో జన సమీకరణ చేయాలని యేచిస్తోంది కాంగ్రెస్. ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ సభలోనే ఈ సభలోనే  రాహుల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటించబోతున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లపై దృష్టి సారించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. రాహుల్‌ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఉత్తమ్‌ సూచించారు. రాహుల్‌ ప్రత్యేక విమానంలో బేగంపేటకు వస్తారని, అక్కడి నుంచి సంగారెడ్డి వరకు భారీగా ర్యాలీ నిర్వహించాలని ఆయన చెప్పారు. నగర వ్యాప్తంగా జెండాలు, తోరణాలతో అలంకరణ చేయాలన్నారు. కాగా ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఏమేరకు ఎండగడతాడో చూడాలి మరి!.

Advertisements

అలరించిన యేసుక్రీస్తు నాటకం

మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో సోమవారం రాత్రికి యేసుక్రీస్తు జీవిత చరిత్ర బయలు నాటకము జీవితచరిత్ర ప్రదర్శింపచేయడం జరిగిందని నాటక కార్యనిర్వాహణకుడు రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.ఏసయ్య తెలిపారు. సోమవారం రాత్రికి మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామానికి మేథడిస్ట్ యూత్ చెందిన 32 మంది యువకులతో గ్రామాంలో యేసుక్రీస్తు జీవితచరిత్ర బయలు నాటకమును నిర్వహించడం జరుగుతుందన్నారు. 1న రాత్రి 1వ భాగం నాటకము పూర్తయింది. 2న రాత్రి 2వ భాగం నాటకములను నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటకము నిర్వహించే రంగస్థలానికి రంగు రంగుల విద్యుత్ దీపములచే అలంకరించి, హల్లికేడ్ పరుదలతో అలంకరణ, వికారాబాద్ శ్రీనీలకంఠ డ్రా మా కంపేని వారితో వేషదారులకు మేకప్ వేయించడం జరిగిందన్నారు.

ఝరసంగం మండల పరిధిలోని కంబలపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య దర్శకత్వంతో నాటకము నిర్వహించడం జరిగిందన్నారు. వివిధ మండల పరిధిలోని భక్తులు పాల్గొని నాటకమును విజయవతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ కాం పెండ్ డెలిగెట్ ఎం.శివకూమర్, గ్రామసర్పం చ్ టి.బక్కగౌడ్, ఎంపీటీసీ సీహెచ్.విఠల్, మండల టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి.తుకారం కురుమ, ఉపసర్పంచ్ జి.ల క్ష్మన్, లెమెన్ సుకూమర్, పాస్టర్ డా.డెవిడ్, మండల టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, సంఘ పెద్దలు తదితరులు ఉన్నారు.